MNCL: నూతన సంవత్సరంలో మంచిర్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులను సమన్వయం చేస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం ప్రకటనలో తెలిపారు. విద్య, వైద్య రంగాలను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలందేలా చూస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందిస్తామన్నారు.