NLR: ఉలవపాడు మండలంలోని కరేడు పంచాయతీ రామకృష్ణాపురం గిరిజన కాలనీవాసులు మంచినీళ్ల కోసం బుధవారం నిరసన చేపట్టారు. పైపులైన్ పగిలిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రమైందని, అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని వారు కోరారు. ఖాళీ బిందెలతో వారు తమ నిరసనను తెలియజేశారు.