VZM: నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని యస్ కోట పోలీస్ స్టేషన్ సీఐ నారాయణమూర్తి సూచించారు. వేడుకల పేరుతో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.