SRCL: సమ్మక్క సారలమ్మ జాతరతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా పార్వతీపురం భీమేశ్వర సదన్, ఆలయ పరిసరాలు, వీఐపీ రోడ్డు, కోడె క్యూలైన్ మంగళవారం రాత్రి పరిశీలించారు.