NDL: కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట గ్రామంలో ఇవాళ తోట పరమేశ్వర్ రెడ్డి కారుతో కుక్కను ఢీకొట్టడంతో కుక్క అక్కడికక్కడే చనిపోయింది. కుక్క యజమాని హుస్సేన్ భాష పరమేశ్వర్ రెడ్డిని ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.