TG: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. HYD నాచారంలోని HMT నగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు 12వేల మంది దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. స్వామివారికి తులసిమాలలు, ప్రసాదాలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.