ATP: సింగనమల కేజీబీవీ హాస్టల్లో విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. తమకు సేవలందిస్తున్న టీచర్ను ట్రాన్స్ఫర్ చేయవద్దని కోరుతూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి స్పందించి అధికారులను సమస్యపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు వీడియో కాల్ ద్వారా భరోసా ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.