WNP: గోపాలపేట మండలంలోని తాడిపర్తి గ్రామంలో మేకలు, గొర్రెలకు ఉచితంగా నట్టాల నివారణ మందులు పంపిణీ చేశారు. తాడిపర్తి గ్రామ సర్పంచ్ లోకా రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. లోకా రెడ్డి మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్య పరిరక్షణకు రైతులు ఈ మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.