BHPL: జిల్లా పరిధిలో చైనా మంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా SP సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఇవాళ SP సంకీర్త్ మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారని SP పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజా విక్రయించినా, వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.