TG: అసెంబ్లీలో MLA కొత్త ప్రభాకర్ రెడ్డి కీలక ప్రశ్నలు అడిగారు. అక్షరం ముక్క రాని రైతుకు స్మార్ట్ ఫోన్లో యూరియా యాప్ వాడటం ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తక్షణమే ఆ పద్దతి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. జలాశయాలకు సంబంధించిన కాలువల్లో పూడికలు తీయడం లేదని, మరమ్మతులు గాలికి వదిలేశారని పేర్కొన్నారు.