ATP: పుట్లూరు మండలం నూతన ఎస్సైగా సురేంద్రబాబు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన హేమాద్రి బదిలీ కావడంతో ఏర్పడిన ఖాళీలో శిక్షణ పూర్తి చేసుకున్న సురేంద్రబాబును నియమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. మండల ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.