సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి శివారులో సోమవారం ఉదయం కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దేవి యాదగిరి(58), మన్నె ముత్తమ్మ(55)లను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ముత్తమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, యాదగిరి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.