NLG: కొండమల్లేపల్లి మండలం కేశ్యతండా సమీపంలోని హైదరాబాద్ జాతీయ రహదారిపై కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వడ్త్యా సంతోష్(34), వడ్త్యా నరేష్(30) లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.