KDP: వల్లూరు మండలం పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై చరిత్రకారులు బొమ్మిశెట్టి రమేష్ అరుదైన త్రిమూర్తుల కుడ్య శిల్పాన్ని కనుగొన్నారు. ఒకే శిలాఫలకంపై పార్వతీ పరమేశ్వరులు, విష్ణువు, బ్రహ్మ అర్ధపద్మాసనంలో కొలువై ఉండటం ఈ శిల్పం యొక్క ప్రత్యేకత. దీంతోపాటు శైవ ద్వారపాలకులు, ఐదుగురు నాట్యకారిణుల భంగిమలను కూడా శిల్పి అద్భుతంగా రూపొందించినట్లు తెలిపారు.