BDK: చర్ల రోడ్డులోని వైన్ షాపుల సమీపంలోని బెల్ట్ షాప్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. వాగ్వాదం తీవ్రరూపం దాల్చి బీరు బాటిళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.