W.G: ఆర్టీసీ సంస్థ అందిస్తున్న మరిన్ని మెరుగైన సేవలు సద్వినియోగం చేసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శనివారం ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవంలో భాగంగా కార్గో పార్సిల్ -కార్గో రవాణా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. 50 కిలోల వరకు బరువున్న వస్తువులను డోర్ డెలివరీ చేసే సేవలను ఆర్టీసీ సంస్థ చేపట్టిందని చెప్పారు.