బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ స్టేడియంలోనే గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి వరకు స్టేడియంలో ఎంతో చురుగ్గా ఉన్న ఆయన.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఢాకా క్యాపిటల్స్, రాజ్షాహి రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది.