కృష్ణా: కూచిపుడి ఎస్సై పి.శిరీష నేతృత్వంలో పోలీసులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. కూచిపూడి శివారు ప్రాంతంలో రహస్యంగా జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5,800 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.