కృష్ణా: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవనిగడ్డ DSP తాళ్లూరి విద్యశ్రీ అన్నారు. శనివారం మోపిదేవి(M) కాసానగరం వద్ద హైవేపై చల్లపల్లి CI కె. ఈశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి, జరిమానా విధించకుండా హెల్మెట్ కొనుగోలు చేయించి ధరింపజేశారు.