KDP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీసర్వే ప్రక్రియపై అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వేంపల్లిలో శనివారం స్థానిక చింతలమడుగుపల్లి గ్రామంలో తహసీల్దార్ వై.హరినాధ్ రెడ్డి, రైతులు, టీడీపీ నాయకులు పాల్గొని అవగాహన ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. భూ రీసర్వే ద్వారా ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.