రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ HYDలోని ఖైత్లాపూర్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో హైటెక్ సిటీ నుంచి మూసాపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టారు.