BHNG: చేనేత కార్మికుల పట్ల, చేనేత సహకార సంఘాల పట్ల, అలాగే చేనేత పరిశ్రమ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూపడం తగదని, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహ అన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత వ్యక్తిగత రుణాలు రూ.33 కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటికే ఏడాది దాటిందన్నారు.