CTR: శ్రీ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం గో సంరక్షణ ట్రస్ట్‌కు హేమ స్వరూప్ వారి కుటుంబ సభ్యులు రూ.1,00,232 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో రవీంద్రబాబు, సీఎఫ్‌వో నాగేశ్వరరావు, తదితరులు దాతకు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.