NLG: గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఇవాళ నకిరేకల్‌లో జరిగిన నూతన సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని, చిట్యాల, నకిరేకల్ మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.