అనకాపల్లి జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్‌ను ఉపసంహరించి వెంటనే విడుదల చేయాలని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలిపారు. రైతులు ప్రజల కోసం పనిచేస్తున్న అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపించడం విస్మయం కలిగిస్తుందన్నారు.