MDCL: బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా ఎ.శైలజా ఇవాళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడ సర్కిల్ బోడుప్పల్ సర్కిల్లో విలీనం కావడంతో, పీర్జాదిగూడకు సంబంధించిన అన్ని ఫైళ్లను డిప్యూటీ కమిషనర్ త్రిలేశ్వర్ రావు, బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీఐ శ్యామ్ సుందర్ రావు, మేనేజర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.