BHPL: జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఏర్పాటు భాగంగా ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో PCC అబ్జర్వర్లు గౌరీ సతీష్, గజేంద్ర అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్ష పదవి కోసం ఒద్దుల అశోక్ రెడ్డి అబ్జర్వర్లకు దరఖాస్తు ఫారం సమర్పించారు. నూతన కమిటీ ఏర్పాటుతో పార్టీ బలోపేతమవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.