కృష్ణా: తప్పనిసరిగా యూరియా స్టాక్ వివరాల బోర్డు నిర్వహించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి కె.మురళీకృష్ణ ఆదేశించారు. శనివారం చల్లపల్లి మండలం పురిటిగడ్డ, మేకావారిపాలెం సహకార సంఘాలు, ప్రైవేట్ దుకాణాల్లో యూరియా స్టాక్ పరిశీలించారు. మొక్కజొన్న, ఉద్యానవన పంటలకు యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. మొక్కజొన్న, ఉద్యానవన పంటలకు రైతులు ఈ-క్రాప్ చేయించుకోవాలన్నారు.