E.G: గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఒక వ్యక్తి నాటు సారా అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో దాడి నిర్వహించారు. ఈ దాడిలో మిద్దె భద్రరావు అనే వ్యక్తిని అదుపులోనే తీసుకోవడం జరిగిందని తెలిపారు. అతని వద్ద నుంచి 6 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు.