SKLM: జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన దిశ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల పురోగతి, అభివృద్ధి కార్యక్రమాల పనితీరును సమగ్రంగా సమీక్షించారు. వైద్యం, వ్యవసాయం, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.