ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఇంఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు ఆధ్వర్యంలో ప్రజా దర్బారు నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను పరిశీలించి, అధికారులతో మాట్లాడి ఎరిక్షన్ బాబు పరిష్కరించారు. మరికొన్నింటిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.