Anasuya: డబ్బులిచ్చి మరీ ట్రోల్ చేయించారు.. ఇక విజయ్ దేవరకొండ జోలికి వెళ్లను: అనసూయ
టాలీవుడ్ ట్రెండింగ్ వార్ ఏదంటే.. అనసూయ, విజయ్ దేవరకొండదే అని చెప్పొచ్చు. గత కొంత కాలంగా రౌడీ ఫ్యాన్స్, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతునే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా.. ఇండైరెక్ట్‌గా అనసూయ ఏదో ఒక పోస్ట్ చేయడం.. దానికి కౌంటర్‌గా రౌడీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం కామన్ అయిపోయింది. అయితే తాజాగా ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని చెప్పి షాక్ ఇచ్చింది అనసూయ.
ఇటీవల విజయ్(Vijaydevarakonda) నటించిన ‘ఖుషి’ సినిమా(Khushi Movie) పోస్టర్లో.. ‘ది’ విజయ్ అని ఉండటాన్ని పరోక్షకంగా నొక్కి మరీ ఇండైరెక్ట్‌గా ఓ పోస్ట్ చేసింది అనసూయ(Anasuya). దీని పై ట్విట్టర్లో గట్టిగానే వాదించుకున్నారు రౌడీ ఫ్యాన్స్, అనసూయ. అయితే తాజాగా అనసూయ విజయ్ దేవరకొండ ఇష్యూపై ఫస్ట్ టైం స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ.. విజయ్‌తో తనకున్న విభేదాల గురించి చెప్పుకొచ్చింది. అంతే కాదు, ఇకపై తాను ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని చెప్పడం విశేషం. ‘విజయ్ దేవరకొండతో ఎంతో కాలంగా మంచి పరిచయం ఉంది.. మేమిద్దరం మంచి స్నేహితులం. అయితే అర్జున్ రెడ్డి మూవీలో కొన్ని అభ్యంతరకర పదాలను మ్యూట్ చేశారు.
కానీ థియేటర్లో తన అభిమానులతో ఆ పదాలను చెప్పించాడు విజయ్(Vijaydevarakonda). అందుకే.. ఒక తల్లిగా అది నన్ను ఎంతో బాధించింది. ఇలాంటివి అస్సలు ప్రోత్సహించవద్దని చెప్పాను. ఆ తర్వాతే ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ధైర్యంగా ఆ బాధ నుంచి బయటకు వచ్చాను. అంతేకాదు.. విజయ్ సొంత బ్యానర్లో వచ్చిన ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాలో కూడా నటించాను. కానీ విజయ్‌కి సంబంధించిన ఒక వ్యక్తి.. నాపై డబ్బులిచ్చి మరీ ట్రో(Trolls)లో చేయిస్తున్నాడని తెలిసి షాక్ అయ్యాను.
ఇదంతా విజయ్(Vijaydevarakonda)కి తెలియకుండానే జరుగుతోందా? అని అనిపించింది. అసలు విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో లేదో తెలీదు కానీ, ఇక్కడితో ఈ వివాదాన్ని ముగిద్దామని.. అనుకుంటున్నానని వెల్లడించింది. తాను మానసికంగా ప్రశాంతత కోరుకుంటున్నానని.. అందుకే ఇవన్నీ పక్కనపెట్టి జీవితంలో ముందుకు సాగాలని అనుకుంటున్నానని తెలిపింది. ప్రస్తుతం అనసూయ(Anasuya) చేసిన వ్యాఖ్యలు వైరల్(viral)గా మారాయి. మరి నిజంగానే.. అనసూయ ఈ వివాదానికి ఫుల్ పెట్టేస్తుందేమో చూడాలి.