ప్రకాశం: మార్కాపురం పర్యటనకు వచ్చిన గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠితో శనివారం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలు, పోలీసు శాఖ పనితీరు తదితర అంశాలపై వారు ఇరువురు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.