SS: అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. పుట్టపర్తిలో నిర్వహించిన అటవీ పరిరక్షణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అడవికి నిప్పు పెట్టే వారిపై అటవీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, జైలు శిక్ష విధించాలని సూచించారు. అడవుల రక్షణకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని SP తెలిపారు.