ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్పర్సన్ తలారి గౌతమి సోమశేఖర్ శనివారం 14వ వార్డులో పర్యటించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదేశాల మేరకు కమిషనర్ వంశీకృష్ణతో కలిసి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఉదయం చలిని సైతం లెక్కచేయక వీధుల్లో తిరుగుతూ డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.