SRPT: తిరుమలగిరిలో పందుల బెడద రోజురోజుకు పెరుగుతుంది. వీధులు, డ్రైనేజీ కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో ఇవి గుంపులుగా సంచరిస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పందుల వల్ల పారిశుద్ధ్యం పూర్తిగా దెబ్బతిని, అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు వాపోయారు. పందులు స్వైరవిహారం చేస్తున్న పాలకులు పట్టించుకొవడం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.