AP: రాష్ట్రంలో YCP శ్రేణుల తీరుపై హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ‘కొంచెం దూరం వెళ్లి సంబరాలు చేసుకోండని చెప్పినందుకు గర్బిణీ స్త్రీ కడుపుపై కాలితో తన్నారు. దీనిపై ఆ పార్టీ నేత స్పందించలేదు. జంతువుల్ని బలిచ్చి రక్తాభిషేకాలు చేస్తున్నారు. 2029లో మేము అధికారంలోకి వస్తే ఇలానే నరుకుతామని సందేశం ఇస్తున్నారా?’ అంటూ ప్రశ్నించారు.