ELR: భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురానికి చెందిన రఫీ, బన్నీ, చరణ్‌గా గుర్తించారు. ఈ ఘటనతో తిమ్మాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.