ASF: కాగజ్ నగర్ మండలం జంబుగా రైతు వేదికలో శనివారం 23 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను MLA హరీష్ బాబు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. లబ్ధిదారులందరూ 45 రోజుల్లోపు ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని, లేనిపక్షంలో వారి ఇళ్ల కేటాయింపు రద్దుచేసి వేరే వారికి అవకాశం ఇస్తామని తెలిపారు. వచ్చే ఏడాదిలో గ్రామపంచాయతీకి 20 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.