TPT: నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. వడమాలపేట మండలం తిరుమండ్యం నుంచి అప్పలాయగుంటకు వెళ్లే రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నాబార్డ్ ద్వారా రు. 77 లక్షల నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేసి రోడ్డు పనులు పూర్తి చేయించారు. గతంలో గుంతల రోడ్డులో నిత్యం ప్రజలు నానా కష్టాలు పడ్డారని గుర్తు చేసుకున్నారు.