BDK: మణుగూరు పట్టణంలో ప్రధాన రహదారిపై లారీలు ఇష్టానుసారంగా రోడ్డుపై నిలపడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సీరియస్గా తీసుకున్న సీఐ నాగబాబు స్వయంగా ఇవాళ రంగంలోకి దిగి నిబంధనలు ఉల్లంఘించిన లారీలకు చలానాలు విధించారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.