ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో కూలీల కొరత తీవ్రమవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం యాసంగి వరి నాట్లు ఊపందుకోవడంతో, గత రెండేళ్లుగా ఇక్కడికి వస్తున్న మగ కూలీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్థానిక రైతులు నాట్ల కోసం వీరి వద్దకు వరుస కడుతున్నారు.