GNTR: మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన శుక్రవారం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. మొత్తం 60 అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రూ. 20 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. నగరంలో ఖాళీగా ఉన్నా కార్పొరేషన్ దుకాణాలకు వేలం నిర్వహించాలని నిర్ణయించారు. పార్కులు, డివైడర్లను అభివృద్ధి చేసి పచ్చదనం పెంచనున్నారు.