SRD: జాతీయస్థాయి వాటర్ పోలో పోటీలకు సంగారెడ్డికి చెందిన మహమ్మద్ రెహమాన్ ఎంపికయ్యారు. ఈ నెల 27 నుంచి 29 వరకు హైదరాబాద్లోని బాలయోగి స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్, వాటర్ పోలో పోటీలలో ఆయన పాల్గొంటారని రాష్ట్ర కార్యదర్శి ఉమేష్ తెలిపారు. రెహమాన్ జాతీయస్థాయిలోనూ రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు.