TPT: రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోందని తిరుపతి DEO కేవీన్ కుమార్ పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఆధునిక, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇవి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులు తప్పక వీక్షించాలన్నారు.