TG: రాష్ట్రంలో కూరగాయలు, ఆకుకూరల రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా లోకల్ మార్కెట్లు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి 50 కి.మీ.కు ఒకటి చొప్పున మండల కేంద్రాల్లో వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 36 రైతు బజార్లు ఉన్నాయి. ఇవి నగరాల్లో, పట్టణాల్లో ఉండటంతో రైతులకు రవాణా సమస్యగా మారింది.