ఒక గ్లాస్ నీటిలో తేనె కలిపి తీసుకుంటే వెక్కిళ్లు తగ్గుతాయి. అయితే, నీరు చల్లగా ఉండేలా చూసుకోవాలి. వెక్కిళ్లు వచ్చినప్పుడు లోతైన శ్వాసను తీసుకుని వీలైనంత సమయం వరకు శ్వాసను నిలిపి ఉంచాలి. శ్వాసను నిలిపి ఉంచడం సాధ్యం కానప్పుడు నెమ్మదిగా శ్వాసను వదలాలి. వెక్కిళ్లు తగ్గే వరకు దీనిని పునరావృతం చేస్తూ ఉండాలి. ఒక టీ స్ఫూన్ చక్కెరను నోట్లో వేసుకుని నమలకుండా కరిగే వరకు ఉంచుకోవాలి.