BDK: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శుక్రవారం రామయ్య నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్ని వసతులు సిద్ధం చేశారు.