E.G: బూరుగుపూడి గేట్ వద్ద గల జిల్లా TDP కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి గ్రీవెన్స్ కార్యక్రమం జరగనుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ స్వయంగా హాజరై వినతులు స్వీకరిస్తారు. నాయకులు,కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన నేరుగా తెలుసుకుంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ అవకాశాన్ని కార్యకర్తలు వినియోగించుకోవాలని పార్టీ వర్గాలు కోరాయి.