చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిర్వహించిన సోషల్ ఆడిట్ తనిఖీల్లో రికవరీ చేయాల్సిన మొత్తం ఇంకా రూ.1.59 కోట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఐదేళ్లలో నిర్వహించిన సోషల్ ఆడిట్లలో మొత్తం రూ.4.85 కోట్ల మేర అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఇప్పటివరకు రూ.3.26 కోట్లను వసూలు చేసినట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.